T20 Worlcup: రోహిత్, కోహ్లీ, సూర్య వల్ల ఆ ఉపయోగం లేదు.. తుది జట్టు విషయంలో ఆ జాగ్రత్త తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:25 PM
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ-20 ప్రపంచకప్ మొదలైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా జరిగాయి. బుధవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో రోహిత్ సేన వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ-20 ప్రపంచకప్ (T20 Worlcup) మొదలైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా జరిగాయి. బుధవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో రోహిత్ సేన వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది (India vs Ireland). ఈ నేపథ్యంలో తుది జట్టు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎంత మంది బౌలర్లతో బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan pathan) ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.
``టీ20 ప్రపంచకప్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఉండదు. అందుకే ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే దెబ్బతినే ప్రమాదం ఉంటుందది. ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అస్సలు బౌలింగ్ వేయలేరు. ఈ ముగ్గురు టీమిండియాను హ్యాండిక్యాప్డ్ టీమ్‌గా మార్చారు. ఏ బౌలర్ లయ తప్పి భారీగా పరుగులు సమర్పించుకుంటున్నా కెప్టెన్‌కు మరో ఆప్షన్ ఉండద``ని ఇర్ఫాన్ అన్నాడు.
``ఎంపిక చేసిన జట్టు ప్రకారం.. తుది జట్టు విషయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటే ఆరుగురు బౌలర్లు అందుబాటులో ఉంటారు. బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంటుంది. అలా కాకుండా నలుగురు ఫ్రంట్ లైన్ బౌలర్లు చాలు అనుకుంటే శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయగలగాలి. అప్పుడే జట్టులో సమతూకం ఉంటుంద``ని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: టీవీ చూస్తూ చెప్పడానికి బాగానే ఉంటుంది.. కానీ, కోహ్లీని మాత్రం అలాగే ఆడించాలి: గవాస్కర్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..