మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్

ABN, Publish Date - Apr 07 , 2024 | 11:40 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ట్రోలింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్
Virender Sehwag

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో RCB జట్టు మూడు వికెట్ల నష్టానికి 183 స్కోర్ చేసింది, కానీ గెలువలేక పోయింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్ కారణంగానే ఆర్‌సీబీ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేశారు. సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.


ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చిన విధంగా RCB దాదాపు 200 పరుగులు చేయాలి. కానీ RCBకి 20 పరుగులు తక్కువ వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా సెంచరీ చేశాడు. అతను ఫామ్‌లో ఉన్నాడు. కానీ మిగిలిన ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. విరాట్ చివరి వరకు ఆడడం బాగానే ఉంది. కానీ ఎవరూ తనకు సపోర్ట్ చేయలేదు. మ్యాక్స్‌వెల్ వచ్చినా పెద్దగా స్కోర్ చేయలేదు. కొత్త ప్లేయర్ సౌరవ్ కూడా 6 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. గ్రీన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని వెల్లడించారు.

మరోవైపు అసలు దినేష్ కార్తీక్ ఎక్కడ? RCB ఏం చేస్తుంది, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ ఏంటో అర్థం కాలేదన్నారు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌పై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. RCB అనేక తప్పులు చేయడం వల్లనే ఓడిందని వెల్లడించారు. మాక్స్‌వెల్ అత్యంత విజయవంతమైన బౌలర్, అతను ఒక్క ఓవర్ కూడా వేయలేదని గుర్తు చేశారు. మరోవైపు దంగర్‌కు అవకాశం ఇచ్చి తప్పు చేశారని సెహ్వాగ్(Virender Sehwag) అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:

రాజస్థాన్‌ జోష్‌

రాళ్లను మోస్తూ.. పర్వతాలు ఎక్కుతూ

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 07 , 2024 | 11:47 AM

Advertising
Advertising