ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: రేపటి SRH vs RR మ్యాచ్‌లో గెలుపెవరిది.. వర్షం వస్తే ఎవరికి లాభం?

ABN, Publish Date - May 23 , 2024 | 08:37 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్‌కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.

SRH vs RR q2 match

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది. ఈ క్రమంలో రేపు (మే 24న) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత మే 26న కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నారు. ఇప్పటికే క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ రద్దు చేయబడితే ఫైనల్స్‌కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.


చెన్నై(chennai)లో శుక్రవారం ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం(rain) కారణంగా మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది అనే ప్రశ్న తలెత్తుతోంది. రేపటి మ్యాచులో వర్షం కురిస్తే ఒక రోజు రిజర్వ్ డేను కేటాయించారు. ఇక రిజర్వ్ డే రోజున కూడా వర్షం ఎక్కువగా కురిసి మ్యాచ్ రద్దైతే పాయింట్లు, రన్ రేట్ ఆధారంగా ఫలితాన్ని నిర్ణయిస్తారు. వర్షం తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అదనంగా 120 నిమిషాల సమయం ఉంటుంది. తుపాను కారణంగా 5-5 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేకపోతే అంపైర్ సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు.


సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు(cancel) అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పాయింట్ల పట్టికలో ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయం ఉంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 17 పాయింట్లు, మూడవ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు కూడా 17 పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు సమానంగా ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది. నెట్ రన్ రేట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కంటే ముందుంది. అందుకే ఫైనల్స్‌లోకి ప్రవేశించనుంది.


ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లను పోల్చి చూస్తే, రాజస్థాన్‌పై హైదరాబాద్‌దే(SRH) పైచేయి ఉంది. IPLలో RR, SRH మధ్య ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్‌లు జరుగగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్‌ను 10 సార్లు ఓడించింది. మరోవైపు గూగుల్ గెలుపు అంచనా(google win probability) ప్రకారం చూస్తే ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 52 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు 48 శాతం ఛాన్స్ ఉంది.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Sports News and Telugu News

Updated Date - May 23 , 2024 | 09:03 PM

Advertising
Advertising