X TV App: ఎలాన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కి పోటీగా ‘ఎక్స్ టీవీ యాప్’
ABN, Publish Date - Apr 24 , 2024 | 05:01 PM
సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘యూట్యూబ్’ ఒక సంచలనం. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. వినోదం పంచడంతో పాటు లక్షలాది మందికి జీవనాధారంగా మారింది. రూపాయి వెచ్చించకుండానే.. తమ ప్రతిభ చాటుతూ ఎంతోమంది ఈ యూట్యూబ్ ఆధారంగా భారీ మొత్తంలో
సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘యూట్యూబ్’ (Youtube) ఒక సంచలనం. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. వినోదం పంచడంతో పాటు లక్షలాది మందికి జీవనాధారంగా మారింది. రూపాయి వెచ్చించకుండానే.. తమ ప్రతిభ చాటుతూ ఎంతోమంది ఈ యూట్యూబ్ ఆధారంగా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా ఇది తిరుగులేని ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. అయితే.. ఇప్పుడు దీనికి ధీటుగా పోటీనిచ్చేందుకు ‘ఎక్స్ టీవీ యాప్’ (X TV App) త్వరలోనే రాబోతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా దీనిని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
గుంపులో స్మార్ట్‌ఫోన్స్ మాయం.. ఈ సింపుల్ ట్రిక్‌తో వెతికిపట్టిన వ్యక్తి.. ఎలాగంటే?
తాను ట్విటర్‌ని కొనుగోలు చేసినప్పటి నుంచే ఎలాన్ మస్క్ రకరకాల మార్పులు చేస్తూ వస్తున్నాడు. ఆ ప్లాట్‌ఫామ్‌కి ‘ఎక్స్’గా నామకరణం చేయడం, బ్లూ టిక్‌కి చార్జ్ చేయడంతో పాటు మరెన్నో మార్పులు చేర్పులు చేపట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ టీవీ యాప్‌ని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యాడు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ‘‘చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు.. ఎక్స్ ప్లాట్ఫామ్ అన్నింటినీ మార్చేస్తోంది. ఎక్స్ టీవీ యాప్‌తో ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్ టీవీల్లోకి తీసుకురాబోతున్నాం. పెద్ద స్క్రీన్స్‌పై అత్యంత నాణ్యమైన కంటెంట్.. అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇది ఇస్తుంది’’ అని లిండా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!
ఈ ఎక్స్ టీవీ యాప్‌కి సంబంధించిన అప్డేట్స్ తాము ఇస్తూ ఉంటామని.. దీనిని మరింత మెరుగ్గా తయారు చేసేందుకు గాను మీ ఐడియాలను సైతం పంచుకోవాలని లిండా ఎక్స్ వేదికగా యూజర్లను కోరారు. తమ కమ్యూనిటీ కోసమే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని స్థాపించామని చెప్పారు. కాగా.. ఈ ఎక్స్ టీవీ యాప్ దాదాపు యూట్యూబ్ ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్‌లు, AI-ఆధారిత అంశాలు, క్రాస్-డివైస్ అనుభవం, మెరుగైన సెర్చింగ్ ఆప్షన్, సులువైన కాస్టింగ్ విధానం, విస్తృత లభ్యత వంటి అంశాలను ఈ టీవీ యాప్ ద్వారా యూజర్లు ఆశించవచ్చు.
Read Latest Technology News And Telugu News
Updated Date - Apr 24 , 2024 | 05:01 PM