ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..

ABN, Publish Date - Aug 03 , 2024 | 02:39 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

School Time feature google

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. కొన్ని స్కూళ్లలో అయితే ట్యాబ్ లేదా డిజిటల్ బోర్డుల రూపంలో చిన్నారులకు పాఠాలను భోదిస్తున్నారు. ఆ క్రమంలో పిల్లల హోం వర్క్ కూడా ఆన్‌లైన్ విధానంలో చేయాలని లేదా ఫోన్లలో చేసుకోవాలని పలు పాఠశాలలు సూచిస్తున్నాయి. అయితే అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. పలు రకాల గేమ్స్, రీల్స్ చూస్తు టైం పాస్ చేస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.


ఏంటి ప్రయోజనం?

ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్ల(smart phones)లో పిల్లలు చదువుతున్నప్పుడు రీల్స్, ఇతర వినోద విషయాలను చూడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా వారు తమ చదువులపై దృష్టి పెడతారని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఫీచర్ ద్వారా పిల్లలను డిజిటల్ పరధ్యానానికి దూరంగా ఉంచడం, వారి చదువులపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా గూగుల్ దీనిని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అయితే ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అంతరాయాలను తగ్గిస్తుంది

ఈ ఏడాది ప్రారంభంలో Google Fitbit Ace LTE స్మార్ట్‌వాచ్‌లో ‘స్కూల్ టైమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎంపిక చేసిన Android ఫోన్‌లు, టాబ్లెట్‌లు, Samsung Galaxy Watchలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. పాఠశాల సమయంలో పిల్లలు సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా, చదువుపై(studies) దృష్టి పెట్టడం కోసం దీనిని రూపొందించారు. 'స్కూల్ టైమ్' ఫీచర్ కింద తల్లిదండ్రులు పాఠశాల సమయంలో తమ పిల్లల పరికరంలో పరిమిత కార్యాచరణతో ప్రత్యేక హోమ్ స్క్రీన్‌ను సెట్ చేసుకోవాలి.

సోషల్ మీడియా

ఇది తరగతి సమయంలో పిల్లలకు రీల్స్ వంటి ఇతర అంతరాయాలను తగ్గిస్తుంది. పేరెంటల్ కంట్రోల్ యాప్ ద్వారా పాఠశాల సమయంలో ఏ యాప్‌లను పిల్లలు ఉపయోగించవచ్చో తల్లిదండ్రులు(parents) గుర్తించవచ్చు. ఆ సమయంలో మీ పిల్లలు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే కాల్ చేయడం లేదా SMS చేసే విధంగా ఎంపిక చేసుకోవాలి. పాఠశాల సమయం తర్వాత కూడా ఈ ఫీచర్‌ని యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీ పిల్లలు రీల్స్, సోషల్ మీడియా, గేమ్స్ చూసే వ్యసనాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Display Replacement: ఈ వినియోగదారులకు ఫ్రీ డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్‌.. క్రేజీ ఆఫర్ ప్రకటించిన సంస్థ..

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..

For More Technology News and Telugu News..

Updated Date - Aug 03 , 2024 | 02:40 PM

Advertising
Advertising
<