ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cyber Crimes: పాస్‌వర్డ్‌లుగా వీటిని వాడుతున్నారా.. వెంటనే మార్చుకోకపోతే చాలా డేంజర్

ABN, Publish Date - May 16 , 2024 | 06:02 PM

దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. సాధారణ పౌరులు, బిజినెస్ చేసే వారు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర వర్గాల ప్రజల వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుని డబ్బులను మనకు తెలియకుండానే తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సున్నితమైన డేటాను దొంగిలించడానికి పిషింగ్ స్కామ్స్, ర్యాన్సమ్‌వేర్ స్కాంలను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో యూపీఐ అకౌంట్లకు, వ్యక్తిగత డేటాకు మనం ఉపయోగిస్తున్న వీక్ పాస్‌వర్డ్‌లే సైబర్ నేరస్థులకు ఆసరాగా మారాయి. వీక్ పిన్‌తో దేన్నైనా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఉదాహరణకు.. '1234', '0000' లాంటి పిన్‌లను చాలా మంది సెట్ చేసుకుంటారు. వీటిని ఎవరైనా ఈజీగా అంచనా వేయగలరు. కొందరు పుట్టిన తేదీలను, ఫోన్ నంబర్లను పాస్‌వర్డ్‌లుగా(Passwords) పెట్టుకుంటారు. ఇలాంటి వారు కూడా రిస్కీ జోన్‌లో ఉన్నట్లే.


ఎక్కువ మంది ఉపయోగించే పాస్‌వర్డ్‌లివే..

సైబర్ సెక్యూరిటీ స్టడీ ఈ మధ్యే 3.4 మిలియన్ యూజర్ల పిన్ పాస్‌వర్డ్‌లను తనిఖీ చేసింది. అందులో ఎక్కువ మంది వాడుతున్న పాస్‌వర్డ్‌లను బయటపెట్టింది. అవేంటంటే.. 1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969.

ఇలా చాలా మంది ఈజీగా గుర్తుపట్టే పాస్ వర్డ్‌లను యూపీఐ పిన్‌లుగా వాడుతున్నారు. స్ట్రాంగ్ పిన్ ఉపయోగించాలని కంపెనీలు సూచిస్తున్నా.. పలువురు సూచనలు పాటించకపోవడంతో వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతోంది.


పాస్‌వర్డ్‌లుగా ఇవి వద్దు..

పుట్టిన రోజులు, వ్యక్తిగత సమాచారం, రిపీట్ అయ్యే పాస్‌వర్డులను సోషల్ మీడియా దగ్గరి నుంచి యూపీఐ చెల్లింపుల వరకు వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దృఢమైన పాస్‌వర్డ్‌లు డేటాను సురక్షితంగా ఉంచుతాయని చెబుతున్నారు.

For Latest News and Technology News

Updated Date - May 16 , 2024 | 06:02 PM

Advertising
Advertising