మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WhatsApp: భద్రత విషయంలో రాజీ పడం.. ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలపై వాట్సప్ చీఫ్ స్పందన

ABN, Publish Date - May 28 , 2024 | 07:49 PM

వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.

WhatsApp: భద్రత విషయంలో రాజీ పడం.. ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలపై వాట్సప్ చీఫ్ స్పందన

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్‌ డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.

ఈ ఆరోపణలపై విల్‌ క్యాత్‌కార్ట్‌ మాట్లాడుతూ.. మస్క్ చేసిన వాదనలో పస లేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది చెప్పారని, మళ్లీ పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. ‘రోజూ రాత్రి యూజర్‌ డేటాను వాట్సప్‌ ఎక్స్‌పోర్ట్‌ చేస్తుంది.


అయినప్పటికీ అది సురక్షితమేనని కొంతమంది భావిస్తున్నారు’ అని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. దీనిపై విల్‌ క్యాత్‌కార్ట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే చాలామంది ఇదే విషయాన్ని చెప్పారు. నేను చెప్పిన విషయాన్నే రిపీట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. భద్రత అంశాన్ని వాట్సప్‌ తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే యూజర్ల మెసేజ్‌లను ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తాం. ప్రతీ రాత్రి అవి మాకు చేరవు. ఎక్స్‌పోర్టు కావు. మీ మెసేజ్‌లను బ్యాకప్‌ చేయొద్దు అనుకుంటే, క్లౌడ్‌ ప్రొవైడర్‌ను వినియోగించుకోవచ్చు. దానికి కూడా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది’ అని క్యాత్‌కార్ట్ వెల్లడించారు.

ట్విటర్(ఎక్స్)ను కొనుగోలు చేసిన తరువాత మెటా సంస్థపై ఎలాన్ మస్క్ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఆ మధ్య మస్క్, జుకర్ బర్గ్‌ల మధ్య మాటల మంటలు చెలరేగాయి.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 07:51 PM

Advertising
Advertising