ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Students: ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:36 AM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం హాస్టల్‌లో విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించగా 160 మంది విద్యార్థినులు తిన్నారు.

  • ఆసుపత్రికి తరలింపు... కలుషిత ఆహారమే కారణం

  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఘటన

మంచిర్యాల అర్బన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం హాస్టల్‌లో విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించగా 160 మంది విద్యార్థినులు తిన్నారు. అనంతరం పదో తరగతికి చెందిన 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.


ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై హాస్టల్‌ వార్డెన్‌ లక్ష్మిరాజంను వివరణ కోరగా హాస్టల్‌లో విద్యార్థినులతోపాటు తాము కిచిడీ తిన్నామని, 12 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఘటన అనంతరం ఆరోగ్యశాఖ అధికారులు హాస్టల్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు.కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చడి తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 03:36 AM