ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, Publish Date - Nov 23 , 2024 | 04:02 AM

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది.

  • బూరుగుపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఘటన

  • కొత్త బియ్యమే కారణమన్న ప్రధానోపాధ్యాయుడు

గంగాధర, నవ ంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో మొత్తం 205 విద్యార్థులు చదువుతుండగా శుక్రవారం 180 మంది హాజరయ్యారు. వీరు రోజూలానే శుక్రవారం మధ్యాహ్న భోజనం చేశారు. అయితే వీరిలో 17 మందికి కడుపునొప్పి రాగా, ఇంకో ముగ్గురు వాంతులు చేసుకున్నారు.


దాంతో పాఠశాల సిబ్బంది వెంటనే పల్లె దవాఖానాకు సమాచారం అందించారు. వైద్యసిబ్బంది పిల్లలను పరీక్షించి చికిత్స చేశారు. విషయం తెలిసిన వెంటనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కొత్త బియ్యం కావడంతో బియ్యం సరిగా ఉడకలేదని, అందుకే కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారంతా కోలుకున్నారని ఎవరికీ ప్రమాదం లేదని ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్‌ తెలిపారు.

Updated Date - Nov 23 , 2024 | 04:02 AM