ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: వృద్ధురాలిపై సైబర్‌ దొంగల వల..37 లక్షలకు టోపీ

ABN, Publish Date - Nov 04 , 2024 | 04:25 AM

మనీలాండరింగ్‌ కేసుల పేరుతో ఓ 74 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగినిని భయపెట్టి ఆమె ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు పెన్షన్‌ డబ్బును సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆ రిటైర్డ్‌ ఉద్యోగినికి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ కాల్‌ చేశారు.

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మనీలాండరింగ్‌ కేసుల పేరుతో ఓ 74 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగినిని భయపెట్టి ఆమె ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు పెన్షన్‌ డబ్బును సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆ రిటైర్డ్‌ ఉద్యోగినికి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ కాల్‌ చేశారు. తాము ముంబైలోని అంథేరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఆధార్‌పై రిజిస్టర్‌ అయిన నంబర్‌ నుంచి పలువురికి అసభ్య, వేధింపు సందేశాలు, ప్రకటనలు వెళ్లాయని, అందుకు మీపై కేసు నమోదయిందని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడమంటూ కొత్త వారిని రంగంలోకి దించారు. వారు సీబీఐ అధికారులమంటూ పరిచయం చేసుకొని మీ ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు తరలిందని, మీపై మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని ఆమెకు చెప్పారు.


అందుకు మీ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించాలంటూ ఖాతాల వివరాలను తెలుసుకున్నారు. ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేయవచ్చని ఆమెను భయపెట్టారు. విషయం బయటకు చెబితే ఆమెకు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని బెదిరించారు. ఆమె ఖాతాల్లోని డబ్బును వెరిఫికేషన్‌ ఆర్‌బీఐ ఖాతాకు మళ్లించాలని, వెరిఫికేషన్‌ అనంతరం వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించి ఆమె పెన్షన్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మొత్తం కలిపి రూ.37.90 లక్షలను ఆర్‌టీజీఎస్‌ ద్వారా వారు సూచించిన ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - Nov 04 , 2024 | 04:25 AM