ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drug Cases: 39 డ్రగ్స్‌ కేసుల్లో.. 82 మందికి జైలు శిక్షలు

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:22 AM

డ్రగ్స్‌ కేసులకు సంబంధించి ఈ ఏడాది 82 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. వీరంతా ఈ ఏడాది జనవరి నుంచి నమోదైన 39 కేసుల్లో నిందితులు. నిందితులకు గరిష్ఠంగా 20 ఏళ్లు, కనిష్ఠంగా ఆర్నెల్ల చొప్పున జైలు శిక్షలు పడ్డట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది.

  • 17 మందికి గరిష్ఠంగా 20 ఏళ్ల ఖైదు

  • అరెస్టయితే బయటపడడం కష్టమే!

  • ఏపీలోని లంబసింగి నుంచి గంజాయి

  • అడవిలో 20 కి.మీ. నడిచి తరలింపు

  • పక్కాగా చార్జిషీట్లు.. ప్రాసిక్యూషన్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కేసులకు సంబంధించి ఈ ఏడాది 82 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. వీరంతా ఈ ఏడాది జనవరి నుంచి నమోదైన 39 కేసుల్లో నిందితులు. నిందితులకు గరిష్ఠంగా 20 ఏళ్లు, కనిష్ఠంగా ఆర్నెల్ల చొప్పున జైలు శిక్షలు పడ్డట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. పక్కాగా రిమాండ్‌ డైరీ, న్యాయనిపుణుల సలహాలతో చార్జ్‌షీట్‌ దాఖలు, ప్రాసిక్యూషన్‌ ప్రక్రియలో పకడ్బందీగా వ్యవహరించడంతో.. నిందితులకు శిక్షలు ఖరారైనట్లు డీజీపీ జితేందర్‌ తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్‌తో పట్టుబడితే శిక్షలు తప్పవనే భయం పెడ్లర్లలో పెరిగితే.. ఈ దందాను పూర్తిగా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ వినియోగదారులకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తూ.. వారు మరోమారు మత్తుపదార్తాల జోలికి వెళ్లకుండా నిఘా పెడుతున్నామన్నారు.


కాగా.. ఈ ఏడాది మొత్తం కేసుల్లో.. నాలుగింటిలో 17 మందికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. మరో కేసులో ఇద్దరికి 12 ఏళ్ల చొప్పున, 11 కేసుల్లో 19 మందికి పదేళ్ల చొప్పున శిక్షలు ఖరారయ్యాయి. ఇంకొన్ని కేసుల్లో.. ఒకరికి ఐదేళ్లు, ముగ్గురికి ఏడాది, ఎనిమిది మందికి ఆర్నెల్లు, 32 మందికి ఆర్నెల్ల లోపు జైలు శిక్షలు పడ్డాయి. ఈ శిక్షలు ఖరారవ్వడంలో మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్‌, ఖమ్మం, కుమ్రంభీమ్‌-ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పోలీసులు, సైబరాబాద్‌ సిబ్బంది ప్రతిభ కనబరిచారని డీజీపీ కార్యాలయవర్గాలు తెలిపాయి.

Updated Date - Nov 25 , 2024 | 02:22 AM