Medaram: ఇదేం వింత.. మేడారం హుండీలో భక్తురాలి కోరిక చీటి
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:13 PM
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారాలమ్మ జాతర హుండీలను హనుమకొండ లష్కర్ బజార్ టీటీడీ కల్యాణ మండపంలో లెక్కిస్తున్నారు. నగదు, బంగారం భారీగా భక్తులు సమర్పించారు. అందులో ఓ భక్తురాలు కోరిక కోరారు. తన కోరిక తీర్చాలని అమ్మవారికి చీటి రాశారు.
హన్మకొండ: గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారాలమ్మ (Sammakka) జాతర ఘనంగా ముగిసింది. అమ్మ వారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హనుమకొండ (Hanamkonda) లష్కర్ బజార్ టీటీడీ కల్యాణ మండపంలో హుండీ లెక్కించారు. నగదు, బంగారం (Gold) భారీగా భక్తులు సమర్పించారు. అందులో ఓ భక్తురాలు కోరిక కోరారు. తన కోరిక తీర్చాలని అమ్మవారికి చీటి రాశారు.
ఆ చీటిలో ఏముందంటే..?
సమ్మక్క, సారాలమ్మను గిరిజనులే కాక అందరూ కొలుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. అమ్మ వారికి బెల్లం (బంగారం) సమర్పించి కోరిక తీర్చాలని వేడుకుంటారు. అమ్మవారి హుండిలో చీటి కనిపించింది. అందులో ఒకావిడ తన భర్త గురించి రాసింది. బెట్టింగ్ మానేశాయలని చీటిలో రాసింది. పాపం బెట్టింగ్ వల్ల ఆ వివాహిత ఎంత ఇబ్బంది పడిందో. అందుకే అమ్మవారికి ఏకంగా చీటి రాసి వేడుకుంది. తన అక్క కుమారుడికి ఐఐటీ సీటు రావాలని కోరుకుంది. అలా రెండు కోరికలను చీటి ద్వారా అమ్మవారిని కోరింది.
రూ.9.60 కోట్లు
సమ్మక్మ సారాలమ్మ హుండి లెక్కింపును గురువారం నాడు దేవదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. మొదటి రోజు రూ.3.15 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రోజు శుక్రవారం 2.98 కోట్ల ఆదాయం రాగా, మూడో రోజు రూ.3.46 కోట్ల ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 317 హుండీలను లెక్కించగా రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో రాజేంద్రం వివరించారు. 71 ఇనుప హుండీల్లో కరెన్సీ, చిల్లర నాణెలు, వెండి, బంగారాన్ని వేరు చేశామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 03 , 2024 | 01:55 PM