ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ABN Big Debate: కాంగ్రెస్ నాకు వరం ఇచ్చింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN, Publish Date - May 03 , 2024 | 08:17 PM

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో కొండా ఎన్నో అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయడంపై.. తన ప్రత్యర్థుల బలాబలాలపై, తన గెలుపోటములపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ABN Big Debate with Konda Vishweshwar Reddy

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో కొండా ఎన్నో అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయడంపై.. తన ప్రత్యర్థుల బలాబలాలపై, తన గెలుపోటములపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.


బిగ్‌డిబేట్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే..

కాంగ్రెస్ పార్టీ నాకు వరం ఇచ్చింది. వాస్తవానికి సునీతా మహేందర్ రెడ్డిని చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా దాదాపు ప్రకటించింది. కానీ, చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చారు. వాస్తవానికి సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్ల నుంచి పోటీ చేసి ఉంటే.. నాకు టఫ్ ఫైట్ ఉండేది. ఎందుకంటే.. వారికి నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు ప్రజలందరితో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రత్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దగా తిరగలేదు. ఆయనకు పరిచయాలు కూడా లేవు. అందుకే.. నా గెలుపు చాలా ఈజీ అనుకుంటున్నాను. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయి నేతలు మాత్రం రంజిత్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే.. వారందరినీ చాలా హింసించారు. రెవెన్యూ, ల్యాండ్ కేసులు సహా అనేక అంశాల్లో వేధించాడు. అధికార పార్టీలో ఉండి.. కాంగ్రెస్ నాయకులను వేధించాడు. అందుకే వారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కావాలంటే.. బీఆర్ఎస్‌లో చేరాలని ఒత్తిడి చేశాడు. అందుకే.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు రంజిత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే నాకు బలంగా నిలుస్తుంది.

For More Telangana News and Telugu News..

Updated Date - May 03 , 2024 | 08:17 PM

Advertising
Advertising