ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB: కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:34 AM

బిల్లుల చెల్లింపుకు క్లియరెన్స్‌ ఇచ్చేందుకు రూ. 1.14 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి.

  • రూ. 1.14 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

కొత్తగూడెం, సెప్టెంబరు 18: బిల్లుల చెల్లింపుకు క్లియరెన్స్‌ ఇచ్చేందుకు రూ. 1.14 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం జరిగింది. జిల్లాలోని కొందరు రైతులకు వివిధ కంపెనీల నుంచి ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులను సబ్సిడీపై అందజేసింది. ఇందుకోసం ఆయా కంపెనీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ బిల్లులు చెల్లించాలంటే జిల్లా ఉద్యానవన శాఖ అధికారి క్లియరెన్స్‌ ఇవాల్సి ఉంటుంది. ఇందుకు ఆయా కంపెనీల పంపిణీదారులను ముడుపులు చెల్లించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ డిమాండ్‌ చేశాడు.


గతంలో సదరు అధికారి మహబూబాబాద్‌లో పనిచేసిన సమయంలో ఓ కంపెనీ వారు లంచం డబ్బులు బ్యాలెన్స్‌ ఉంచారని, ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో బిల్లులకు ఆ కంపెనీవారు అదనంగా చెల్లించాలని ఒత్తిడి చేశాడు. మొత్తం రూ.1.14లక్షలు చెల్లిస్తేనే బిల్లులకు క్లియరెన్స్‌ ఇస్తానని చెప్పడంతో సదరు కంపెనీకి చెందిన పంపిణీదార్లు జిల్లా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు సూర్యనారాయణను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Sep 19 , 2024 | 04:34 AM

Advertising
Advertising