ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB Officials : బిల్లుకు లంచం

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:09 AM

పెండింగ్‌ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్‌ కమిషనర్‌ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.

  • ఏసీబీకి చిక్కిన పెబ్బేరు మునిసిపల్‌ కమిషనర్‌ ఆదిశేషు

  • 20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

  • ఆదాయానికి మించి ఆస్తులు

  • రంగారెడ్డి ఏజేసీపై మరో కేసు

పెబ్బేరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్‌ కమిషనర్‌ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గత ఏడాది మునిసిపల్‌ వార్డులలో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు గాను దాదాపు రూ.2.6 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉండగా వాటిని మంజూరు చేయాలని వెంకటేశ్‌ అనే కాంట్రాక్టర్‌ కమిషనర్‌ను కోరాడు. అయితే తనకు 10 శాతం లంచం ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్‌ నుంచి కమిషనర్‌ రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 04:09 AM