ACB Raid: ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
ABN, Publish Date - Dec 05 , 2024 | 04:00 AM
రవాణా శాఖ చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని మూడు వేర్వేరు చెక్‌పోస్టులపై ఏసీబీ ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
రూ.1.78 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, దామరచర్ల, జైనథ్, మానవపాడు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖ చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని మూడు వేర్వేరు చెక్‌పోస్టులపై ఏసీబీ ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్, నల్లగొండలోని విష్ణుపురం, గద్వాల్ జిల్లాలోని అలంపూర్ చెక్‌పోస్టులపై ఏసీబీ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ మూడు చెక్ పోస్టుల్లో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో లేని రూ.1.78 లక్షల నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాల్ని గుర్తించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, చెక్‌పోస్టులు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబరు 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
Updated Date - Dec 05 , 2024 | 04:00 AM