TS News: ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు
ABN, Publish Date - May 31 , 2024 | 09:56 AM
హైదారాబాద్ రెడ్ హిల్స్‌లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం కార్య నిర్వహణ అధికారి కె .బాన్సిలాల్ (EE)ఇద్దరు ఏఈలు నికేశ్,కార్తిక్ లతో పాటు మరో అధికారిని ను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ నికేష్, కార్తీక్, బన్సీలాల్‌లతో పాటు మరో అధికారి ఏసీబీకి చిక్కారు.
హైదరాబాద్: హైదారాబాద్ రెడ్ హిల్స్‌లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం కార్య నిర్వహణ అధికారి కె .బాన్సిలాల్ (EE)ఇద్దరు ఏఈలు నికేశ్,కార్తిక్ లతో పాటు మరో అధికారిని ను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ నికేష్, కార్తీక్, బన్సీలాల్‌లతో పాటు మరో అధికారి ఏసీబీకి చిక్కారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి నేటి ఉదయం 6 గంటల వరకూ.. మొత్తంగా 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాల్లో 20 మంది బృందం పాల్గొంది. నాలుగు గంటల పాటు శ్రమించి నాలుగో అధికారిని పట్టుకొని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Updated Date - May 31 , 2024 | 09:56 AM