TS News: బొగ్గు గనిలో ప్రమాదం.. ఎల్‌హెచ్‌డీ యంత్రం నుంచి కిందపడి..
ABN, Publish Date - May 30 , 2024 | 07:28 AM
బొగ్గు గనిలో పని అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ కష్టం. అసలే బొగ్గు గనిలో విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు మండే ఎండలు.. అంతటి శ్రమకోర్చి కుటుంబం గడవడం కోసం నానా తిప్పలు పడినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు వెంటాడుతుంటాయి. తాజాగా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.
పెద్దపల్లి: బొగ్గు గనిలో పని అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ కష్టం. అసలే బొగ్గు గనిలో విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు మండే ఎండలు.. అంతటి శ్రమకోర్చి కుటుంబం గడవడం కోసం నానా తిప్పలు పడినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు వెంటాడుతుంటాయి. తాజాగా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్‌హెచ్‌డీ యంత్రం నుంచి కిందపడి ఇజ్జగిరి ప్రతాప్ అనే ఆపరేటర్ మృతి చెందాడు. ఎల్‌హెచ్‌డీ యంత్రం గోడను ఢీకొట్టడంతో.. యంత్రం క్రింద పడిపోయి ఆపరేటర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రతాప్ మృతదేహన్ని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించడం జరిగింది.
Hyderabad: రూ.500 కోట్ల సర్కారు భూమి స్వాహా
Read more Telangana News and Telugu News
Updated Date - May 30 , 2024 | 07:28 AM