ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Murali Mohan: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్..

ABN, Publish Date - Sep 08 , 2024 | 11:57 AM

జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా (HYDRAA) నోటీసులు.. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్‌స్ట్రక్షన్ (Jayabheri Constructions) వంతు వచ్చేసింది..! ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.. 15 రోజుల్లో నేల మట్టం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై మురళీమోహన్ తొలిసారి స్పందించారు..

Murali Mohan

హైదరాబాద్: జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా (HYDRAA) నోటీసులు.. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్‌స్ట్రక్షన్ (Jayabheri Constructions) వంతు వచ్చేసింది..! ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.. 15 రోజుల్లో నేల మట్టం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా కథనాలు వచ్చాయి కానీ.. ‘వాళ్లకు వాళ్లుగా కూల్చితే సరే లేకుంటే మేమే కూల్చేస్తాం’ అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) చెప్పారో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎట్టకేలకు హైడ్రా ఇచ్చిన నోటీసులపై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు.


మూడు అడుగులే..

మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మురళీమోహన్ (Murali Mohan) తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్‌ రంగంలో ఉన్నాను. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. బఫర్ జోన్‌లో ఉంటే నేనే కూల్చేస్తాను. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఆధికారులు వచ్చారు. బఫర్ జోన్‌లో మూడు అడుగుల మేరకు.. రేకుల షెడ్డు ఉన్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆ రేకుల షెడ్డును మేమే తొలగించేస్తాం.. హైడ్రా రానక్కర్లేదు. రెండ్రోజుల్లో (మంగళవారం లోపు) తాత్కాలిక షెడ్డును తొలగిస్తాం అని మురళీ మోహన్ స్పష్టం చేశారు. దీంతో కొన్ని గంటలుగా మురళీ మోహన్‌పై వచ్చిన చిత్ర విచిత్రాలుగా వచ్చిన కథనాలు, విమర్శకులకు చెక్ పెట్టినట్లు అయ్యింది.


తొలగిస్తే సరే..

హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థ చీఫ్ ఏవీ రంగనాథ్ కూడా స్పందించారు. ‘ హైదరాబాద్‌లోని నానక్ రామ్‌గూడ రంగలాల్ చెరువులో నటుడు మురళీ మోహన్ జయభేరి కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించాం. ఆక్రమణ జరిగినట్లుగానే మా పరిశీలనలో తేలింది. వారంలో రోజుల్లో ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలను తొలిగించేందుకు జయభేరి సంస్థ గడువు కోరారు. ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేస్తుంది’ అని రంగనాథ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. సండే అయినా సరే కూల్చుడే అంటూ హైడ్రా నాన్ స్టాప్‌గా, దూకుడు మీద కూల్చివేతులు షురూ చేసింది. ఇవాళ ఒక్కరోజే భారీగా కూల్చివేతలు జరిగాయి. మాదాపూర్, మేడ్చల్ జిల్లా మల్లంపేట్‌, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇక మాదాపూర్ సున్నం చెరువులో కూడా హైడ్రా కొరడా ఝులిపించింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చేసింది.

Updated Date - Sep 08 , 2024 | 12:22 PM

Advertising
Advertising