ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల వాటా

ABN, Publish Date - Sep 20 , 2024 | 10:23 PM

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్‌గా 33 శాతం వాటా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శుక్రవారం సచివాలయంలో లాభాల బోనస్‌ను ప్రకటించారు.

మంచిర్యాల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్‌గా 33 శాతం వాటా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శుక్రవారం సచివాలయంలో లాభాల బోనస్‌ను ప్రకటించారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను కార్మికులకు పంచనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో లాభాల వాటా కింద ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్షా 90వేలు బోనస్‌గా అందనున్నాయి. మరో రూ.2,289 కోట్లతో సింగరేణి భవిష్యత్‌, వ్యాపార విస్తరణ ప్రణాళికలు చేపట్టనున్నారు. కాగా సింగరేణి చరిత్రలోనే ఇది అత్యధిక లాభాల బోనస్‌గా చెప్పవచ్చు.

గతేడాది కన్నా రూ.20 వేలు అదనం

ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా గతేడాదితో పోల్చితే ఒక్కో కార్మికునికి రూ.20 వేలు అదనంగా అందనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం లాభాల్లో 32 శాతం వాటాను ప్రకటించింది. రూ.711 కోట్లను కార్మికులను వాటా కింద అందజేసింది. ఇప్పుడు దానికి అదనంగా రూ.85 కోట్లు అధికంగా లాభాల వాటా చెల్లించను న్నారు. గత సంవత్సరం సగటున ఒక్కో కార్మికునికి రూ.లక్షా 70వేలు లాభాల బోనస్‌గా అందగా ప్రస్తుతం అదనంగా రూ. 20వేలు చెల్లించనున్నారు.

కాంట్రాక్టు కార్మికులకూ లాభాల బోనస్‌

సింగరేణిలో పొరుగు సేవల కింద పని చేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులకు కూడా లాభాల బోనస్‌ అందజేయనున్నట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకూ లాభాల బోనస్‌ ప్రకటించడం గమనార్హం. సింగరేణి వ్యాప్తంగా 25వేల మంది కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులు పని చేస్తుండగా సగటున వారికి కూడా రూ.5 వేల వరకు లాభాల బోనస్‌ చెల్లించేందుకు నిర్ణయించారు.

సమిష్టి కృషి....

జనక్‌ ప్రసాద్‌, సెక్రటరీ జనరల్‌ ఐఎన్టీయూసీ

కార్మికుల సమిష్టి కృషి, ప్రభుత్వ సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల వాటా దక్కనుంది. గత సంవత్సరంతో పోల్చితే లాభాల వాటా పెంచేందుకు కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే...

సీతారామయ్య, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు

సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల వాటా చెల్లించేలా సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ తరుపున ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించింది. అలాగే వరద బాధితుల సహాయార్థం రూ. 10.25 కోట్లను కూడా కార్మికుల జీతాల నుంచి కోత లేకుండా యాజమాన్యం వాటా నుంచి చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాం.

Updated Date - Sep 20 , 2024 | 10:23 PM