గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
ABN, Publish Date - Oct 27 , 2024 | 10:28 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేటాయింపుల్లో రోడ్డు, రవాణా, విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మన్నెగూడం క్రాస్‌రోడ్ నుంచి కోనంపేట మీదుగా కుశ్నపల్లి వరకు బీటీ రోడ్డు, మన్నెగూడం ప్రాథమిక పాఠశాల ప్రహారి నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు.
నెన్నెల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేటాయింపుల్లో రోడ్డు, రవాణా, విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మన్నెగూడం క్రాస్‌రోడ్ నుంచి కోనంపేట మీదుగా కుశ్నపల్లి వరకు బీటీ రోడ్డు, మన్నెగూడం ప్రాథమిక పాఠశాల ప్రహారి నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణంతో మన్నెగూడం, కోనంపేట, పాటి గ్రామస్థుల రవాణా కష్టాలు తీరుతాయన్నారు. ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుందన్నారు. రోడ్డు పనులు సత్వరం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్, తోట శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, గట్టు బానేష్, బాపురెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సంధ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.
రవాణా మార్గం మెరుగుపడితేనే అభివృద్ధి
తాండూర్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా మార్గం మెరుగ్గా ఉండాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం మండలంలోని బోయపల్లి నుంచి గుండుగూడెం మీదుగా బుగ్గ రాజరాజ్వేర దేవాలయం వరకు రూ. 2.40 కోట్లతో రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో అంతర్గత రహదారులు చేపడతామన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోయపల్లి మాజీ సర్పంచు సుందిళ్ల భూమయ్య నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని అండగా తాము ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, మాజీ ఎంపీటీసీలు సూరం రవీందర్ రెడ్డి, సిరంగి శంకర్, మాజీ జెడ్పీటీసీ బండి పోచం, మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి, నాయకులు రత్నాకర్, మాసాడి తిరుపతి, మాసాడి ప్రభాకర్, మాసాడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 10:28 PM