ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేరుకుపోయిన బకాయిలు

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:42 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వివిధ వర్గాలకు చెందిన పిల్లల కోసం కస్తూర్బా, జ్యోతిబాపూలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పేర్లతో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని స్కూళ్లను ప్రారంభించింది. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతోపాటు అవసరమైన అన్ని వసతులను సమకూర్చింది.

మంచిర్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసింది. జిల్లాలో బాలురు, బాలికలకు వివిధ మండలాల్లో వేర్వేరుగా ఎనిమిది రకాల మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఆయా పాఠశాలల్లో ఒక్కో చోట సగటున 640 మంది విద్యార్థుల చొప్పున జిల్లా వ్యాప్తంగా కనీసం ఐదు వేల మంది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసిస్తున్నారు.

వివిధ వర్గాల వారీగా స్కూళ్లు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వివిధ వర్గాలకు చెందిన పిల్లల కోసం కస్తూర్బా, జ్యోతిబాపూలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పేర్లతో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని స్కూళ్లను ప్రారంభించింది. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతోపాటు అవసరమైన అన్ని వసతులను సమకూర్చింది. అప్పటి నుంచి విజయవంతంగా పాఠశాలలు కొనసాగుతుండగా లక్షలాది మంది ఆర్థికంగా వెనుకబడిన కులస్థులు వాటిపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు.

పేరుకుపోయిన బకాయిలు

జిల్లాలో వివిధ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లతోపాటు జ్యోతిబాపూలే గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటికి ఏరియాను బట్టి సాలుసరి అద్దె రూ.9 లక్షలు మొదలుకొని రూ. 18 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పాటు తరువాత 2017లో పాఠశాలలు ప్రారంభించిన నాటి నుంచి గత విద్యా సంవత్సరం వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాఠశాల నిర్వహణ సాగింది. తొమ్మిది నెలలుగా పాఠశాలల్లో సమస్యలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిది నెలలుగా జ్యోతిభాపూలే పాఠశాలల భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో సమస్యలు తెరపైకి వచ్చాయి. అద్దె చెల్లించాలని యజమానులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో వారంతా ఆందోళన బాట పట్టారు. ప్రైవేటు భవన యజమానుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మూకుమ్మడిగా పాఠశాలలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. జిల్లాలోని చెన్నూరు, లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి, తాండూరులలోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలల భవనాలకు యజమానులు తాళాలు వేశారు.

పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో..

ప్రభుత్వం అద్దె చెల్లించని కారణంగా భవనాలకు తాళాలు వేశామని యజమానులు చెబుతున్నారు. దసరా సెలవులు ముగిసి మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావలసి ఉంది. సొంత ఊళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి వచ్చేందుకు మరో రెండు మూడు రోజలు సమయం పట్టే అవకాశం ఉండటంతో తాళాలు వేసిన ఘటన ప్రభావం పెద్దగా చూపలేదు. అయితే బోధనా, బోధనేతర సిబ్బంది పాఠశాలకు వెళ్ళే సరికి తాళాలు వేసి ఉండడంతో బయటనే గడపాల్సి వచ్చింది. రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భవన యజమానులు తాళాలు వేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. దీంతో ప్రభుత్వం తరుపున మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో యజమానులు దిగొచ్చి తాళాలు తెరిచారు. కాగా రెసిడెన్షియల్‌ స్కూళ్ల భవనాలకు తాళాలు వేసిన యజమానులపై ఆయా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఏడు నెలలు బకాయి ఉన్నాయి

గోపీచంద్‌, జ్యోతిబాపూలే ఉమ్మడి జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌

జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బీసీ వెల్ఫేర్‌ జ్యోతిభాపూలే రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సంబంధించి ఈ సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబరు వరకు 7 నెలల కిరాయి చెల్లించాల్సి ఉంది. త్వరలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. భవనాలకు తాళాలు వేశారన్న విషయం తెలియగానే మాట్లాడటం జరిగింది. యజమానులు తాళాలు తెరిచినందున విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Updated Date - Oct 15 , 2024 | 10:42 PM