ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:33 PM

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, మున్సిపల్‌, పోలీస్‌ అధికారు లతో కలిసి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో పర్యటిం చారు. మార్కెట్‌లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే అధికారులను అదేశిం చారు.

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబరు 22: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, మున్సిపల్‌, పోలీస్‌ అధికారు లతో కలిసి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో పర్యటిం చారు. మార్కెట్‌లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే అధికారులను అదేశిం చారు. కాంప్లెక్స్‌ల కింద సెల్లార్లను పార్కింగ్‌ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. కూరగా యల మార్కెట్‌లో రోడ్డు పక్కన ఇటీవల వెలిసిన టేలాలు తొలగించాలన్నారు. గతంలో ఉన్న తొమ్మిది టేలాలకు పాత వాటర్‌ ట్యాంక్‌ను కూల్చివేసిన తర్వాత అక్కడ షెడ్లు వేసుకోవాలన్నారు. కూరగా యల మార్కెట్‌ రోడ్డు మధ్యలో ఉన్న తోపుడు బండ్లను కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌ రోడ్‌ మధ్యలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అజయ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కాంప్లెక్స్‌ ఎదుట అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పొడిగింపు షెటర్లను తొలగించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. దుకాణాల ఎదుట అక్రమణలను తొలగించాలని సూచించారు.

ఇవన్నీ పట్టణ అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలే తప్ప ఎవరిపై వ్యక్తిగత కోపాలు లేవని ఎమ్మెల్యే చెప్పారు. బుధవారం నుంచి తొలగింపు ప్రక్రియను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, ఏసీపీ ఆర్‌.ప్రకాష్‌, అధికారులు, నాయకులు ఉన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 10:33 PM