ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెటాలియన్‌లో అదనపు డీజీపీ తనిఖీలు

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:48 PM

మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలి యన్‌ను శుక్రవారం రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ల అదనపు డీజీపీ సం జయ్‌కుమార్‌ జైన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెటాలియన్‌కు వచ్చిన ఆయనకు రామగుండం సీపీ శ్రీనివాస్‌, డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌, బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటరాములు పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

హాజీపూర్‌, సెప్టెంబరు 27: మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలి యన్‌ను శుక్రవారం రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ల అదనపు డీజీపీ సం జయ్‌కుమార్‌ జైన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెటాలియన్‌కు వచ్చిన ఆయనకు రామగుండం సీపీ శ్రీనివాస్‌, డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌, బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటరాములు పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పోలీస్‌ పరేడ్‌ మైదానం, ఆయుధ కేంద్రం, ఆపరేషన్‌ ప్లాటూన్‌లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. బెటాలియన్‌లోని ఫంక్షన్‌ హాల్‌ను, సూపర్‌ మార్కెట్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి కానిస్టేబుళ్లతో మాట్లాడారు. భోజన వసతి గురించి ఆరా తీశారు. బెటాలియన్‌లో పోలీసు సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకుని రుణాల విషయంలో సిబ్బందికి సహకరించాలని తెలిపారు. కమాం డెంట్‌ వెంకట రాములు, అసిస్టెంట్‌ కమాండెంట్‌లు నాగేశ్వర్‌ రావు, కాళిదాసు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 10:48 PM