ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను ఉపసంహరించాలి
ABN, Publish Date - Sep 22 , 2024 | 10:31 PM
ఉపాధ్యాయుల సర్దు బాటు కోసం జారీ చేసిన మార్గదర్శకాలు సహేతుకం కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 నాటి రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం 10 మందికి ఒక టీచర్, 60 మందికి ఇద్దరు టీచర్లు అనే నిబంధన అమలు చేయాలనుకోవడం సరికాదని, ఇది ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవు తుందన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 22: ఉపాధ్యాయుల సర్దు బాటు కోసం జారీ చేసిన మార్గదర్శకాలు సహేతుకం కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 నాటి రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం 10 మందికి ఒక టీచర్, 60 మందికి ఇద్దరు టీచర్లు అనే నిబంధన అమలు చేయాలనుకోవడం సరికాదని, ఇది ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవు తుందన్నారు. 20 మంది వరకు ప్రతీ పాఠశాలకు ఇద్దరు టీచర్లను, 50 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠ శాలకు ఒక హెచ్‌ఎం పోస్టును మంజూరు చేయాలని, ప్రతీ తరగతికి ఒక టీచర్‌ను నియమించినప్పుడే నాణ్య మైన విద్య అందుతుందన్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలు వెల్లడించి ఉపాధ్యాయులను వెంటనే నియమించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సాంబయ్య, నాగరాజు, చందు, ప్రవీణ్‌కుమార్, సునీల్ పాల్గొన్నారు.
నిబంధనలను మార్చాలి
మంచిర్యాల అర్బన్: రేషనలైజేషన్ జీవో నెంబర్ 25 నిబంధనలను మార్చాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవేణులు డిమాండ్ చేశారు. తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా సర్దుబాటు ఉత్త ర్వులను కలెక్టర్లను ఆదేశిం చడాన్ని ఖండిస్తున్నామ న్నారు. 11 మంది విద్యా ర్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను, 60 మంది ఉన్న పాఠ శాలకు ఇద్దరే ఉపాధ్యాయు లను కేటా యించాలని పేర్కొనడం అసం బద్దమైన విషయమన్నారు. 40 మంది వరకు ఇద్దరు, 60 మందికి ముగ్గురు, 20 మంది విద్యార్థులకు ఒక ఉపాద్యాయుడి చొప్పున కేటాయిం చాలని, ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యా యుడిని నియమించాలని డిమాండ్ చేశారు. సర్దుబాటు ప్రక్రియ ద్వారానైనా బదిలీ అయిన ఎస్‌జీటీ ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు.
Updated Date - Sep 22 , 2024 | 10:31 PM