ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్షరాస్యత పెంపు లక్ష్యంగా...

ABN, Publish Date - Sep 08 , 2024 | 10:40 PM

నిరక్షరాస్యత కారణంగా మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణాలతో పోల్చితే పల్లెల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అక్షర వెలుగులు నింపే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మంచిర్యాల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నిరక్షరాస్యత కారణంగా మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణాలతో పోల్చితే పల్లెల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అక్షర వెలుగులు నింపే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 15 ఏళ్లు పైబడిన వయోజనులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే చేపడుతోంది. కార్యక్రమానికి కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఉన్నత పాఠశాలల్లోని ముగ్గురు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆయా స్కూళ్లలో విద్యనభ్యసించే 8, 9, 10 తరగతుల విద్యార్థులచే వయోజనులకు చదవడం, రాయడం నేర్పించనున్నారు.

జిల్లాలో 64.35 అక్షరాస్యత శాతం

జిల్లాలో 64.35 శాతం అక్ష్యరాస్యత ఉంది. దాన్ని వంద శాతం పెం చేలా చర్యలు చేపడుతున్నారు. 2011 సెన్సన్‌ ప్రకారం జిల్లాలో 8,07,037 మంది జనాభా ఉన్నారు. వీరిలో 4,08,272 మంది పురుషులు, 3,98,765 మంది స్ర్తీలు ఉన్నారు. వీరిలో మున్సిపాలిటీలు మినహా గ్రామాల్లో అక్ష్యరాస్యత లేని పురుషులు 31,767 మంది కాగా, స్త్రీలు 53,000 మంది ఉన్నారు. ట్రాన్స్‌ జెండర్స్‌ 13 మంది ఉన్నారు. వారందరికీ చదువు నేర్పించాలనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.

ఈచ్‌ వన్‌....టీచ్‌ ఫైవ్‌....

పల్లెల్లో నిరక్ష్యరాస్యులకు చదువు నేర్పేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఐఎల్‌పీ పథకంలో భాగంగా ఈచ్‌ వన్‌...టీచ్‌ ఫైవ్‌ నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. చదవడం, రాయడం వచ్చిన ప్రతి ఒక్కరూ మరో ఐదుగురు నిరక్ష్యరాస్యులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దాలి. 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఈచ్‌ వన్‌.....టీచ్‌ వన్‌ నినాదంతో కార్యక్రమం ప్రవేశపెట్టి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో సర్వే నిర్వహించింది. అనంతరం విద్యావంతులు నిరక్ష్యరాస్యులకు చదువు చెప్పాలని నిర్దేశించింది. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఒక్కో వార్డులో నిరక్ష్యరాస్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక విద్యాబోధన కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. మరోవైపు కేంద్రం పడ్‌నా...లిఖ్‌నా...అభియాన్‌ అమలు చేసేందుకు నిరక్షరాస్యుల వివరాలు సేకరించింది. వివరాలను అధికారులు పంచాయతీరాజ్‌ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అక్షరాస్యత పెంచే బాధ్యతలను పంచాయతీలకు అప్ప గించారు. కరోనా విజృంభణతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా న్యూ ఇండియా లిటరసీ ద్వారా పల్లెల్లో అక్షరాస్యతా పెంచేందుకు కేంద్రం పథక రచన చేసింది.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో

కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు అదనంగా జిల్లాలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో పల్లెల్లో అక్షర్యాస్యతా పెంపొందించేందకు కార్యాచరణ రూపొం దించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇంటర్‌, డిగ్రీ, పీజీలు చదివిన మహిళలను ఎంపిక చేసి ముందుగా వారికి కుట్ట మిషన్‌ శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలతో గ్రామంలో నిరక్షరాస్యులైన మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ ఇప్పిస్తారు. దాంతోపాటే చదువడం, రాయడం కూడా నేర్పిస్తారు. ఇందుకుగాను నిరక్షరాస్యులకు చదువు చెప్పే మహిళలకు స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల ద్వారా గౌరవ వేతనం చెల్లిస్తారు. అలా గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అక్షరాస్యతకు దూరంగా ఉన్న ఆదివాసీ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

అక్షరాస్యత పెంచేందుకు కృషి....

వయోజన విద్య జిల్లా ప్రాజెక్టు అధికారి పురుషోత్తం

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ప్రత్యేక చొరవతో రూపొందించిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని చదువు కున్న మహిళలతో నూరు శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. మహిళలకు చదువుతోపాటు కుట్ట మిషన్‌ శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నాం. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, వివిధ శాఖల అధికారులు, యువత సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఐఎల్‌పీ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:40 PM

Advertising
Advertising