సమీపిస్తున్న ఓటరు నమోదు గడువు
ABN, Publish Date - Oct 27 , 2024 | 10:33 PM
పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టడంతో వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశావహులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు వేర్వేరుగా జరగనున్నాయి.
మంచిర్యాల, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టడంతో వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశావహులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు వేర్వేరుగా జరగనున్నాయి. రెండు వర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారను న్నాయి. ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్‌రెడ్డి కొనసాగుతుండగా, టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూకు చెందిన రఘోత్తం రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత నెల 30 నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి పట్టభఽద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సుమారు 300 మండలాలకు చెందిన ఎని మిది లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారని అంచనా. గతంతో పోల్చితే పట్టభద్రుల సంఖ్య అధికంగా ఉండ టం, వారి వివరాల సేకరణకు నాలుగు ఉమ్మడి జిల్లాలు తిరగాల్సి రావడంతో ముందస్తుగా ఆశావహులు ఓటరు నమోదు ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
ఊపందుకున్న ప్రచారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రు లను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఓటరు నమోదు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉండడం తో 10 రోజులే మిగిలి ఉంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ నెలకొనడంతో టీచర్లకు ఓటరు నమోదు తప్పనిసరి అయింది. అయితే పట్టభద్రుల నుంచి మాత్రం స్పందన అంతంతే ఉంది.
ఓటరు నమోదుకు స్పందన కరువు
జిల్లాల్లోని అన్ని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారిని నియమించి దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. అయినా ఆదరణ అంతంతా మాత్రంగానే ఉంటోంది. దీపావళి పండగ అనంతరం నమోదు ప్రక్రి య వేగం పుంజుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తిలో ఉన్నవారు కూడా ఓటరు నమోదుకు అంతగా స్పందించకపోవడం విశేషం. ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాఠశాలలకు వెళ్లి నమోదు పత్రాలు అందజేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మండలి ఎన్నికల్లో ఓటు వేయా లంటే కొత్తగా అర్హులందరూ దరఖాస్తు సమర్పించాలి. దీంతో ఆశావహులు, ఆయా పార్టీల ఇన్‌చార్జిలు స్వయంగా రంగంలోకి దిగి ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. పట్టభద్రుల విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, తదితర వివరాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
ఓటరు నమోదు ఇలా....
ఓటరు నమోదు చేసుకునేందుకు 2021 అక్టోబరు 31 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వారు ఫారం -18ను పూర్తి చేయడం ద్వారా ఓటరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులైతే 2018 నవంబరు వరకు మూడేళ్లకు తగ్గకుండా పని చేసి ఉండాలి. వీరు ఫారం-19ను పూర్తి చేయాలి. అలాగే మొబైల్ ఫోన్‌లోనూ ఓటరు నమోదు చేసుకునే వెసలుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది. సంబంధిత ఫారాన్ని పూర్తిచేసి గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన డిగ్రీ ప్రొవిజనల్, ఆధార్ ఓటర్ ఐడీలతోపాటు ఫొటోను పైన పేర్కొన్న వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
Updated Date - Oct 27 , 2024 | 10:34 PM