ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN, Publish Date - Nov 16 , 2024 | 10:30 PM

జిల్లాలో ఆదివారం గ్రూప్‌3 పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,038 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, రూట్‌, జాయింట్‌ రూట్‌ అధికారులు, ప్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గ్రూప్‌3 పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,038 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, రూట్‌, జాయింట్‌ రూట్‌ అధికారులు, ప్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. వైద్య, పోలీసు సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2, సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్ష నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌, పోలీసు నోడల్‌ అధికారిగా బెల్లంపల్లి ఏఆర్‌ ఏసీపీ సుందర్‌, రీజియన్‌ కో ఆర్డినేటర్‌గా నరేందర్‌రెడ్డిలను నియమించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ తెలిపారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థులు ఉదయం 8.30 గంటల మధ్యాహ్నం 2 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు రావాలని సూచించారు. అరగంట ముందు గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒరిజనల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టికల్‌ వస్తువులు అనుమతించరని తెలిపారు.

పరీక్ష కేంద్రాల పరిశీలన

జిల్లా కేంద్రంలోని గ్రూప్‌ 3 పరీక్ష కేంద్రాలను పరీక్షల నోడల్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ శనివారం పరిశీలించారు. వసతుల గురించి ఆరా తీశారు. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

హాజీపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపల్లిలో గల ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల గ్రూప్‌ 3 పరీక్ష కేంద్రాన్ని ఆర్డీవో శ్రీనివాసరాలు పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతుల గురించి చీఫ్‌ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఎస్‌ఐ గోపతి సురేష్‌ ఉన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 10:30 PM