చెరువు మత్తడి పేల్చివేత కేసులో నిందితుల అరెస్టు
ABN, Publish Date - Sep 20 , 2024 | 10:16 PM
పట్టణంలోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన నలుగురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం చెన్నూరు పోలీస్‌స్టేషన్‌లో విలేక రుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బేతాలివాడకు చెందిన పెండ్యాల లక్ష్మీనారాయణ, మారెమ్మవాడకు చెం దిన భీం మధుకర్, రాసమల్ల శ్రీనివాస్, ఏసీసీకి చెందిన గోగుల దానయ్యలు చెరువు మత్తడిని ధ్వంసం కేసులో అరెస్ట్ చేశామన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 20: పట్టణంలోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన నలుగురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం చెన్నూరు పోలీస్‌స్టేషన్‌లో విలేక రుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బేతాలివాడకు చెందిన పెండ్యాల లక్ష్మీనారాయణ, మారెమ్మవాడకు చెం దిన భీం మధుకర్, రాసమల్ల శ్రీనివాస్, ఏసీసీకి చెందిన గోగుల దానయ్యలు చెరువు మత్తడిని ధ్వంసం కేసులో అరెస్ట్ చేశామన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరి ధిలోని సర్వే నంబర్లు 355, 356, 357, 358, 359, 360 సర్వే నంబర్లలో 15.20 ఎకరాల భూమి గోదావరిఖని ప్రాంతానికి చెందిన చెరుకు బుచ్చిరెడ్డి పేరు మీద ఉంద న్నారు. ఆ భూమిని పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులైన మంచాల రాజబాపు, నడిపెల్లి లక్ష్మణ్‌రావు, లక్కం రాజబాపు, రాంలాల్‌గిల్డా, బత్తుల సమ్మయ్య, పెద్దింటి శ్రీనివాస్, పోగుల శేఖర్, ఎన్నం బానయ్య, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్డాలు కొనుగోలు చేశారన్నారు. వీరు ఈ భూమిని పట్టణానికి చెందిన గొడిసెల బాపురెడ్డికి విక్రయించారన్నారు. అయితే అందులో 4.20 ఎకరాలు మాత్రమే బాపురెడ్డి పేరు మీద రిజిస్ర్టేషన్ అయ్యింద న్నారు. మిగిలిన 11 ఎకరాలు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి లో ఉండగా రిజిస్ర్టేషన్ కాలేదన్నారు. దీంతో ఈ ఇరు పార్టీల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయన్నారు. వివా దం ఉన్న 11 ఎకరాల భూమిలో మట్టి పోసి ప్లాట్లుగా మార్చేందుకు పథకం పన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధి లోని భూమిలో మట్టి నింపడం తో వర్షాల మూలంగా వరద నీరు చెరు వులో చేరి కింది ప్రాంతంలోని బేతాళివాడ, మారెమ్మవాడ, మహం కాళివాడ, తదితర కాలనీల్లోని ఇం డ్లలోకి నీరు వస్తోందన్నారు. 11వ వార్డు కౌన్సిలర్ భర్త పెండ్యాల లక్ష్మీనారాయణ, భీం మధుకర్, రాస మల్ల శ్రీనివాస్‌లు పథకం ప్రకారం చెరువు మత్తడి ఎత్తును తగ్గించడానికి డ్రిల్ మిషన్‌తో పగల గొట్టేందుకు పథకం పన్నారు. మంచి ర్యాల ఏసీసీ ప్రాంతానికి చెందిన గోగుల దానయ్యను సంప్రదించగా రూ.30 వేలకు ఒప్పుకొన్నాడ న్నారు. ఈ నెల 13న రాత్రి దానయ్య చెరువు మత్తడిని పగులగొట్టే ప్రయత్నం చేయగా విఫలమైంది. జిలెటిన్ స్టిక్స్‌తో పగులగొట్ట వచ్చని దానయ్య పేర్కొన్నాడన్నారు. పేలుడు పదార్ధం నల్గొండలో దొరుకుతుందని, మరికొంత డబ్బు కావాల నడంతో భీం మధుకర్ ఫోన్‌పే నుంచి దానయ్య కొడుకు గోగుల శ్రావణ్‌కుమార్‌కు రూ.17 వేలు పంపించాడ న్నారు. ఈ నెల 16న రాత్రి పెండ్యాల లక్ష్మీ నారాయణ, రాసమల్ల శ్రీనివాస్, భీం మధుకర్, గోగుల దానయ్యలు చెరువు వద్దకు చేరుకుని జిలెటిన్ స్టిక్స్ అమర్చి మత్తడి బ్లాస్టింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా విచా రణ కొనసాగుతుందన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ట్రాక్టర్, బైక్, కంప్రెషర్ డ్రిల్లింగ్ మిషన్, పేలుడు పదార్ధాలు, జీఏ వైరు, బ్లాస్టింగ్ వైరు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించడంలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్‌తో పాటు సీఐ రవీందర్, ఎస్‌ఐ శ్వేత, కానిస్టేబుల్ టిక్కయ్య, భూమన్న, హోంగార్డు అబ్దుల్ ఖాదీర్‌ను డీసీపీ అభినందించారు.
Updated Date - Sep 20 , 2024 | 10:16 PM