ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలి
ABN, Publish Date - Nov 30 , 2024 | 10:44 PM
వ్యవసా యంలో ఆధునికత, సాంకేతికతపై రైతులు అవగాహన పెంచుకోవాలని డైరెక్టర్ ఐసీఆర్ డాక్టర్ షేక్ ఎస్ మీరా అన్నారు. శనివారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగ్‌పూర్, వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్ధ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు.
బెల్లంపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వ్యవసా యంలో ఆధునికత, సాంకేతికతపై రైతులు అవగాహన పెంచుకోవాలని డైరెక్టర్ ఐసీఆర్ డాక్టర్ షేక్ ఎస్ మీరా అన్నారు. శనివారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగ్‌పూర్, వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్ధ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద ఉత్తమ పద్ధతుల ద్వారా పత్తి ఉత్పాదకత పెంచే అధిక సాంద్రత పద్ధతిలో రైతులు పత్తిని సాగు చేయాలన్నారు.
రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు పాటిస్తూ పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులతో లాభాలను ఆర్జిం చవచ్చన్నారు. చీడపీడల నివారణకు రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అనంతరం కేవీకే ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఉత్తమ రైతు లను శాస్త్రవేత్తలు సన్మానించారు. కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ, పత్తి ప్రధాన శాస్త్రవేత్త వీరన్న, అగ్రికల్చర్ ప్రొఫెసర్ మధుబాబు, ప్రధాన శాస్త్రవేత్త సునీల్ మహాజన్, శ్రీధర్ సిద్ది, వెంకట్‌రామ్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 10:44 PM