ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Balkasuman: మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉంది.. ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత

ABN, Publish Date - Jan 08 , 2024 | 09:59 PM

డిసెంబర్ 9వ తేదీన ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు... ఏమైంది..? అని బీఆర్ఎస్ ( BRS ) నేత బాల్కసుమన్ ( Balkasuman ) ప్రశ్నించారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ నాయకులకు ఇంకా బుద్ది మారడం లేదు. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారం ఆపాలని బాల్కసుమన్ అన్నారు.

హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీన ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు... ఏమైంది..? అని బీఆర్ఎస్ ( BRS ) నేత బాల్కసుమన్ ( Balkasuman ) ప్రశ్నించారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ నాయకులకు ఇంకా బుద్ది మారడం లేదు. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారం ఆపాలి. ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నెల రోజుల్లోనే సీఎం, మంత్రుల అహంకారం ప్రజలు గమనిస్తున్నారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా యుట్యూబ్ చానెళ్లను ఏమి అనలేదు. వందరోజుల్లో చెప్పిన హామీలు అమలు చేయండి సహకరిస్తామని చెప్పాం. కానీ అది మాని మా మీద బురద జల్లుతున్నారు. రైతు బంధు ఇవ్వలేదు కానీ రాఘవ కంపెనీ అకౌంట్‌లోకి వందల కోట్లు ఎలా వెళ్లాయి. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం దుర్మార్గం. కక్ష సాధింపు చర్యలు మానుకోండి. మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో చాలామందికి ప్రాణహానీ ఉంది. మా మాజీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా జరగరానిది జరిగితే దానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత’’ అని బాల్కసుమన్ హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2024 | 09:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising