ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:34 PM

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

వేమనపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

అనంతరం దస్నాపూర్‌లోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ఉపాధ్యాయులను అడిగారు. సెలవుల తర్వాత విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. వంట గదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలన్నారు. నీల్వాయిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని లేకుంటే శాఖపరమైన చర్యలుంటాయన్నారు. వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. వేమనపల్లి పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Oct 15 , 2024 | 10:34 PM