BJP: సరస్వతీ అమ్మవారి సేవలో బీజేపీ నేతలు.. కాసేపట్లో విజయసంకల్ప యాత్ర
ABN, Publish Date - Feb 20 , 2024 | 09:36 AM
Telangana: బాసర సరస్వతీ అమ్మవారిని ఎంపీ సోయం బాపు రావు, బీజేపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎంపీ సోయంబాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు.
నిర్మల్, ఫిబ్రవరి 20: బాసర సరస్వతీ అమ్మవారిని ఎంపీ సోయం బాపు రావు (MP Soyam Bapurao), బీజేపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో (ABN- Andhrajyothy) ఎంపీ బాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు. మోదీ (PM Modi) పాలనలో జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్‌తో (BRS) పొత్తు ఉండదని.. అది మునిగే పడవ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ నుంచి తానే పోటీలో ఉంటానని.. భారీ మెజారిటీతో గెలుస్తానని ఎంపీ సోయంబాపురావు ధీమా వ్యక్తం చేశారు.
కాగా.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈరోజు నుంచి మార్చి 2 వరకు తెలంగాణ బీజేపీ రథయాత్రలు సాగనున్నాయి. రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. బాసర సరస్వతీ దేవి ఆలయంలో నేతలు పూజలు చేసి యాత్రను ప్రారంభించనున్నారు. బాసరలో అస్సోం సీఎం హేమంత బిస్వా శర్మ (Assam CM Hemanta Biswa Sharma), యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) రథయాత్రలో పాల్గొంటారు. నారాయణపేటలో కిషన్ రెడ్డి (Kishan Reddy), తాండూరులో రథయాత్రలో బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొననున్నారు. డీకే అరుణ, ఈటల (Etela Rajender), లక్ష్మణ్ (Laxman), ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) తదితరులు రథయాత్రలో పాల్గొంటారు. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కమలం పార్టీ నేతలు కలుసుకోనున్నారు. కేంద్ర విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 20 , 2024 | 09:42 AM