ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీపీ మండల్‌ కమిషన్‌ అమలు చేయాలి

ABN, Publish Date - Oct 29 , 2024 | 10:35 PM

కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మౌన దీక్ష చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ అప్పటి జనతా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి 1978లో బీపీ మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మౌన దీక్ష చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ అప్పటి జనతా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి 1978లో బీపీ మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు.

కమిషన్‌ దేశ వ్యాప్తంగా పర్యటించి 1980లో 40 అంశాలతో కూడిన నివేదికను అందజేసిందన్నారు. నివేదిక ఇచ్చి 40 సంవత్సరాలు దాటుతున్నా ఏ ఒక్క సిఫార్సులను అమలు చేయలేదన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీపీ మండల్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, నాయకులు చుంచు రాజ్‌కిరణ్‌, కర్రె లచ్చన్న, భీంసేన్‌, రమేష్‌, వేణుగోపాల్‌, సతీష్‌,రమేష్‌, బిక్షపతి, రాజేశం, రాజన్న, చారి, సతీష్‌, శ్రీనివాస్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 10:35 PM