బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో
ABN, Publish Date - Nov 09 , 2024 | 10:42 PM
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
గర్మిళ్ల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
దివాకర్‌రావు మాట్లాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. వెంటనే కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు గాదె సత్యం, అంకం నరేష్, తాజుద్దీన్, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, రవీందర్‌రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, తిరుపతి, మహ్మద్ రఫీ, శంకర్, ప్రదీప్,క్రాంతి, భానుచందర్, షారుక్, వేణుగోపాల్, అంకుస్ పాల్గొన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 10:42 PM