అన్నదాతల్లో గుబులు
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:19 PM
వాతావరణ మార్పులతో అన్నదాతల్లో గుబులు నెలకొంది. తుఫాన్ ప్రభా వంతో జిల్లాలో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తు న్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బెల్లంపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : వాతావరణ మార్పులతో అన్నదాతల్లో గుబులు నెలకొంది. తుఫాన్ ప్రభా వంతో జిల్లాలో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తు న్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు.
జిల్లాలో మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు గత నెల 17నుంచి జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 3.26లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికారులు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 1950 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిగితా ధాన్యం రైతుల కళ్లాల్లో నిల్వ ఉంది. మరికొందరు రైతులు హార్వెస్టర్‌లు, కూలీల కొరతతో ఇప్పటి వరకు వరి కోత కోయలేదు.
వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన
బంగాళఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శనివా రం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురి సింది. దీంతో రైతులు వారి పంట పొలాల వద్ద నిల్వఉన్న ధాన్యంపై టార్పాలిన్‌లు కప్పుతున్నారు. దాన్యం తడవ కుండ ఉండేందుకు నానాతంటాలు పడుతున్నారు. పంటను కొను గోలు కేంద్రాలకు తరలిద్దామంటే తేమ శాతం అధికంగా ఉంటుందని ధాన్యం ఆరబెడుతున్నారు. మబ్బులు కమ్ముకొని జల్లులు పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Dec 01 , 2024 | 11:19 PM