చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
ABN, Publish Date - Sep 26 , 2024 | 10:43 PM
తెలంగాణ సా యుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురు వారం చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 26: తెలంగాణ సా యుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురు వారం చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐలమ్మ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని తెలిపారు. ఐలమ్మ వర్ధంతి, జయంతిలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతో షంగా ఉందన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధికి అధికారి వినోద్‌కుమార్, రజక సంఘం నాయకులు బాపు, వెంకటేశం, రాజేశం, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయ పనులను వేగవంతం చేయాలి
హాజీపూర్, సెప్టెంబరు 26: కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండ లంలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను ప్రిన్సిపాల్ జక్కుల ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు క్రీడా రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. భవనాన్ని రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, గుత్తేదారుల సమన్వయంతో త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 26 , 2024 | 10:43 PM