మట్టి గణపతులను పూజించాలి
ABN, Publish Date - Sep 06 , 2024 | 10:48 PM
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 6: మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో మాట్లాడారు. మట్టి వినాయకులను పూజించి నిమజ్జనం చేయ డం ద్వారా చెరువులు, జలాశయాలు కలుషితం కావన్నారు. రసాయ నాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనంతో నీరు, నేల కలుషితం అవుతుందన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. అదనపు కలె క్టర్ మోతిలాల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి నాగేశ్వర్ రావు, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్, డీఆర్‌డీవో కిషన్, అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, యోగే శ్వర్ పాల్గొన్నారు. గుండేటి యోగేశ్వర్ బంకమట్టితో తయారు చేసిన విగ్రహాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
బెల్లంపల్లి: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలని ఆర్డీవో హరికృష్ణ, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్యలు పేర్కొన్నారు. పట్టణం లోని కాంటా చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు పర్యావ రణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని సూచించారు. సమితి అద్యక్షుడు ఆడెపు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.
మట్టి గణపతుల పంపిణీ
బెల్లంపల్లి(తాండూర్): తాండూర్ ఐబీ చౌరస్తాలో అభినవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంజనిపుత్ర ఎస్టేట్స్ సహకారంతో ప్రజలకు మట్టి గణ పతులను పంపిణీ చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణానికి మేలు చేయాలని కోరారు. ఆర్‌ఐ అంజన్‌కుమార్, ఏపీవో నందన్‌కుమార్, ఈసీ సత్యనారాయణ, సల్వాజీ మహేందర్‌రావు, రవీందర్, రామన్న, శేషగిరి, చంద్రశేఖర్, కృష్ణదేవరాయలు, అభినవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 10:48 PM