CM Revanth: గిరిజన బాలికకు సీఎం రేవంత్ సాయం.. ఎందుకంటే
ABN, Publish Date - Oct 30 , 2024 | 12:40 PM
Telangana: గిరిజిన బాలిక సాయిశ్రద్ధ ఎంతో కష్టపడి చదవింది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఎంబీబీఎస్‌లో మంచి మార్కులు వచ్చి సీటు కూడా సంపాందించింది. కానీ ఇక్కడే ఆమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి. డాక్టర్ చదువుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ సాయి శ్రద్ధ కుటుంబీకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
కొమురంభీం, అక్టోబర్ 30: డాక్టర్ అవ్వడం ఆ అమ్మాయి కల. అందుకోసం కష్టపడి చదవడంతో ఎంబీబీఎస్‌లో సీటు కూడా సంపాదించింది. కానీ ఇక్కడే ఆమెకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ కాలేజీ ఫీజు కట్టే స్తోమత ఆ కుటుంబానికి లేకుండాపోయింది. దీంతో డాక్టర్ కావాలన్న విద్యార్థిని ఆశపై ఆర్థిక పరిస్థితులు నీళ్లు చల్లుతున్న పరిస్థితి. బాలిక విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెంటనే స్పందించారు. బాలిక చదవుకునేందుకు ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సీఎం ముందుకొచ్చారు. ఆ బాలికకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇంతకీ ఆ బాలిక ఎవరో చూద్దాం.
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
కొమురం భీం జిల్లా జూనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయి శ్రద్ధ. ఈ బాలిక ఎంతో మంచి స్టూడెంట్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతూ అన్నింటిలోనూ ఫస్ట్‌ర్యాంక్ తెచ్చుకుంది. అంతే కాదు పదో తరగతిలోనూ మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఆమె కల మాత్రం డాక్టర్ అవడం. ఇందు కోసం కష్టపడి చదవింది కూడా. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఎంబీబీఎస్‌లో మంచి మార్కులు వచ్చి సీటు కూడా సంపాదించింది. కానీ ఇక్కడే ఆమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి. డాక్టర్ చదువుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ సాయి శ్రద్ధ కుటుంబీకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
పూట గడవడానికి వారికి కష్టంగా ఉంది. ఈ సమయంలో తమ బిడ్డకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిందని తల్లిదండ్రులు సంతోషించారు. కానీ కాలేజ్‌లో జాయిన్ చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదవి ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక సాయి శ్రద్ధ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. డాక్టర్ అవ్వాలనే కల నెరవేరేందుకు ఆర్థికి ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దీంతో తన కలను ఎలా నెరవేర్చుకోవాలో తెలీక బాలిక సతమతమవుతున్న పరిస్థితి.
YSRCP: బరితెగించిన వైసీపీ నేత... ఏకంగా ఉపాధ్యాయురాలిపై
అయితే బాలిక సాయి శ్రద్ధ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం.. బాలిక చదవు విషయంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కలను నెరవేర్చే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం. అంతే కాకుండా బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ చదువు చదివేందుకు స్వయంగా ముఖ్యమంత్రి సహాయం చేస్తుండంతో బాలిక ఆనందం వ్యక్తం చేసింది. తాను చదువుకునేందుకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలిక సాయిశ్రద్ధ, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం సాయంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇకపై డాక్టర్ చదవేందుకు ఎలాంటి ఆటంకం లేవని.. కష్టపడి చదవి డాక్టర్ అవుతానని బాలిక చెబుతోంది.
ఇవి కూడా చదవండి...
Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 30 , 2024 | 12:56 PM