ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటరు జాబితా నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి

ABN, Publish Date - Sep 14 , 2024 | 11:03 PM

గ్రామ పంచాయతీ సాధారణ ఓటరు జాబితా నమోదు ప్రక్రి యను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరించే బీఎల్‌వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం దేవాపూర్‌ గ్రామపంచాయతీలో కలెక్టర్‌ పర్యటించారు.

కాసిపేట, సెప్టెంబరు 14: గ్రామ పంచాయతీ సాధారణ ఓటరు జాబితా నమోదు ప్రక్రి యను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరించే బీఎల్‌వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం దేవాపూర్‌ గ్రామపంచాయతీలో కలెక్టర్‌ పర్యటించారు. ఐదుగురు బీఎల్‌వోల పనితీరు సరిగ్గా లేక పోవడం, బీఎల్‌వోల ఓటరు జాబితా యాప్‌లో నమోదు ప్రక్రియలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేపట్టి పేర్ల నమోదులో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నార న్నారు. ఇదే విధానం కొనసాగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అక్టోబరు 18 లోగా ఓటరు జాబితా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం అందించే అభయహస్తం రూ.500లకే గ్యాస్‌ సిలెండర్‌ కార్డును లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు అందరూ రేషన్‌ డీలర్ల వద్ద కార్డులు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ బోజన్న, కార్యదర్శి కవిత, మాజీ ఎంపీటీసీలు మేరుగు పద్మశంకర్‌, రాజమౌళి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌, స్థానిక నాయకులు షాకీర్‌, చంటీ, మైదం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

బెల్లంపల్లి: పట్టణంలో కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ఓటరు జాబితా సర్వేను పరిశీలించారు. ఇంటిం టా ఓటరు జాబితా సమగ్ర సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. పట్టణంలోని 86వ బూత్‌లో ఓటరు జాబితాకు సంబంధించి బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ను వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఎంత మంది ఇండ్లలో ఓటర్లు ఉన్నారని, ఎన్ని ఇండ్లు సర్వే పూర్తి చేశారని అడిగి తెలుసుకుకున్నారు. అంగన్వాడీ సిబ్బంది, బూత్‌ లెవల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:03 PM

Advertising
Advertising