ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

ABN, Publish Date - Oct 13 , 2024 | 10:05 PM

చెన్నూరు నియో జకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరు గుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలి పారు. శనివారం సింగరేణి పాఠశాల మైదానంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాంలీల కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు.

మందమర్రి టౌన్‌, అక్టోబరు 13: చెన్నూరు నియో జకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరు గుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలి పారు. శనివారం సింగరేణి పాఠశాల మైదానంలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాంలీల కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయూత అందిస్తుందని, శ్రీరామరక్షగా పని చేస్తుందన్నారు. ఎన్నికలకు ముం దు తాను ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. వంద కోట్లతో సురక్షిత తాగు నీటి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సింగరేణి యాజమాన్యం సామా జిక బాధ్యతతో పరిసర ప్రాంతాల అభివృద్ధికి డీఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్మిక, కార్మి కేతర కుటుంబాలకు దసరా శుభాకాంక్షలు తెలి పారు.

జీఎం దేవేందర్‌ మాట్లాడుతూ కార్మిక, కార్మికే తర కుటుంబాల ఆహ్లాదం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దీనికి కార్మిక సంఘాల సహ కారం మరువలేనిదని పేర్కొన్నారు. అనంతరం రాం లీల కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, జీఎం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ సలేంద్ర సత్యనారా యణ అధ్యక్షత వహించారు. బెల్లంపల్లి, రామకృ ష్ణాపూర్‌ సెక్రెటరీలు మల్లేష్‌, అక్బర్‌ ఆలీ, సుద ర్శన్‌, కంది శ్రీనివాస్‌, దినేష్‌, గాండ్ల సంపత్‌, బండి సదానందం యాదవ్‌ పాల్గొన్నారు. జాతీయ కళాకారుడు అంతడుపుల నాగరాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Oct 13 , 2024 | 10:05 PM