శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్
ABN, Publish Date - Oct 08 , 2024 | 10:10 PM
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తున్నామని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ట్యాంకు బస్తీలో పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ ఫోర్స్‌తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాల న్నారు.
కాసిపేట, అక్టోబరు 8: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తున్నామని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ట్యాంకు బస్తీలో పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ ఫోర్స్‌తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాల న్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్ర వాహనదా రులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎవరైనా భూకబ్జాలకు, భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలుంటా యని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్ప దంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అం దించాలన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 36 బైక్‌లు, 2 ఆటోలను సీజ్ చేశారు. బెల్టుషాపుల్లో తనిఖీలు చేసి రూ.7606 విలువ గల మద్యం సీజ్ చేశారు. కాసిపేట, దేవాపూర్, మందమర్రి, రామకృ ష్ణాపూర్ ఎస్‌ఐ పాల్గొన్నారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నార్కోటిక్ డాగ్ ద్వారా తనిఖీలు నిర్వహిం చామని సీఐ అప్జలొద్దీన్ తెలిపారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఎస్‌ఐ మహేందర్, పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 10:10 PM