క్రైం రేటు తగ్గించే విధంగా పనిచేయాలి
ABN, Publish Date - Sep 26 , 2024 | 10:45 PM
క్రైం రేటును తగ్గించే విధంగా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీని వాస్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
లక్షెట్టిపేటరూరల్, సెప్టెంబరు 26: క్రైం రేటును తగ్గించే విధంగా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీని వాస్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్‌ను పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న రికా ర్డులను తనిఖీ చేశారు. నామినల్ రోల్స్ పరిశీలించి హెచ్‌ఆర్‌ఎంఎస్ తనిఖీ చేసి డ్యూటీల ప్రకారం నామినల్ రోల్‌లో ఉండా లని తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా యని, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రౌడీలు, సంఘ విద్రోహశక్తు లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. చెడు ప్రవర్తన కలి గిన వ్యక్తులపై నిఘా ఉంచి వారి కదలికలను గమ నించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ నరేందర్,ఎస్‌ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Sep 26 , 2024 | 10:45 PM