ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ కట్టడం కూల్చివేత

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:45 PM

సమయం గురువారం ఉదయం ఆరు గంటలు... నస్పూర్‌ కలెక్టరేట్‌ రోడ్డులోని టీబీజీకేఎస్‌ మాజీ నేత డికొండ అన్నయ్య ఇంటికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది చేరుకు న్నారు... ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తామని, ఇళ్ళు ఖాళీ చేయాలని సూచించారు... కుటుంబ సభ్యులు కూల్చివేతను అడ్డుకోవడంతో అన్నయ్యతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

నస్పూర్‌, సెప్టెంబరు 19: సమయం గురువారం ఉదయం ఆరు గంటలు... నస్పూర్‌ కలెక్టరేట్‌ రోడ్డులోని టీబీజీకేఎస్‌ మాజీ నేత డికొండ అన్నయ్య ఇంటికి రెవెన్యూ, పోలీసు సిబ్బంది చేరుకు న్నారు... ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తామని, ఇళ్ళు ఖాళీ చేయాలని సూచించారు... కుటుంబ సభ్యులు కూల్చివేతను అడ్డుకోవడంతో అన్నయ్యతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇంటిలోని సామాగ్రిని మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో కిందకు తరలించారు... అనంతరం రెండు ఎక్స్‌కావేటర్‌తో భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన కూల్చివేత పనులు మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు ఏడున్నర గంటలపాటు పనులు చేపట్టి భవనాన్ని నేలమట్టం చేశారు. జిల్లాలో తొలిసారిగా ఐదంతస్తుల భవనాన్ని కూల్చి వేస్తుండడంతో ప్రజలు భారీగా గూమిగూడారు. జాతీయ రహదారికి సమీపంలో కూల్చివేత జరుగుతుండడంతో స్థానికులతోపాటు ప్రయాణికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు భవనం సమీపంలోకి ప్రజలు రాకుండ కట్టడి చేశారు. కూల్చివేత చివరి దశలో ఫిల్లర్‌ పగులగొడుతుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. పెద్ద ఎత్తున దుమ్ము రావడం, కొన్ని క్షణాలు ఏమి జరిగిందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కూలుతున్న సమయంలో ఎక్స్‌కావేటర్‌ డ్రైవర్‌ శశీ కిందకు దూకాడు. శిథిలాల్లో ఎక్స్‌కావేటర్‌ ముందు ఉన్న క్రేన్‌ అందులో ఇరుక్కుపోయింది. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చిట్యాల సతీష్‌, పట్టణ సీఐ ఆకుల అశోక్‌, ఎస్సై సుగుణాకర్‌ పర్యవే క్షించారు.

ఫ ముందస్తు నోటీసులు ఇచ్చాం - కమీషనర్‌ సతీష్‌

డికొండ అన్నయ్య సర్వే నంబరు 40లో అనుమతులు తీసుకుని సర్వే నంబరు 42లో నిర్మాణం చేశారని కమిషనర్‌ చిట్యాల సతీష్‌ తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులు 2022 నుంచి పలు మార్లు నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులపై ఆయన స్పందించకపోవడంతో 15 రోజుల కిందట మరోసారి నోటీసు ఇచ్చామన్నారు. రెవెన్యూ అధికారుల నివేదిక ప్రకారం కూల్చివేశామన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 11:45 PM