ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన

ABN, Publish Date - Aug 30 , 2024 | 10:38 PM

సింగరేణి సంస్థ ఆధ్వ ర్యంలో చెన్నూరులో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. శివలింగాపూర్‌ గ్రామ సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం పూర్తవగా శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. మూతపడిన బొగ్గు గని సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి సంస్థ 70 ఎకరాల స్థలాన్ని కేటాయిం చింది.

చెన్నూరు, ఆగస్టు 30: సింగరేణి సంస్థ ఆధ్వ ర్యంలో చెన్నూరులో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. శివలింగాపూర్‌ గ్రామ సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం పూర్తవగా శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. మూతపడిన బొగ్గు గని సమీపంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి సంస్థ 70 ఎకరాల స్థలాన్ని కేటాయిం చింది. ఇందులో సుమారు రూ.67 కోట్లతో 11 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ పనులను పూణెకు చెందిన ఎన్‌రిచ్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. నిర్వహణ పనులు గతేడాది ప్రారంభించారు. చుట్టూ ప్రహారీ నిర్మాణం, ముఖద్వారం పనులు పూర్తి చేయగా లోపల 50 ఎకరాల్లో సోలార్‌ ప్లేట్‌ లను బిగించారు. ఈ పవర్‌ ప్లాంటు ద్వారా వచ్చే విద్యుత్‌ ఉత్పత్తిని కిష్టంపేటలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రానికి అనుసంధానం చేశారు.

ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

శివలింగాపూర్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంటు ప్రారం భానికి వస్తున్న ఉపముఖ్యంత్రి భట్టి విక్రమార్క పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి పవర్‌ ప్లాంట్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సభా స్థలి వద్ద ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర విషయాలపై చర్చించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడద న్నారు. సభాస్థలిని బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీ లిస్తున్నారు. మంచిర్యాల ఆర్డీవో రాములు, సింగరేణి జీఎం శ్రీనివాసరావు ఏర్పాట్లను పరిశీలించారు.

పటిష్ట బందోబస్తు

జైపూర్‌: జిల్లాలో డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఎస్టీపీపీలోని హెలిప్యాడ్‌, శంకుస్ధాపన ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పలు ప్రాంతాల నుంచి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్‌ సీఐ మోహన్‌, ఎస్‌ఐ శ్రీఽధర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 10:38 PM

Advertising
Advertising