ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:36 PM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా రక్షణ చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో రెండు రోజు లపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవ కాశం ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగ కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 1: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా రక్షణ చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో రెండు రోజు లపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవ కాశం ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగ కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెస్య్కూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అధికా రులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థి తిని సమీక్షించాలన్నారు. ప్రజలు జల దిగ్భందంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టా లన్నారు. చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వద్దకు వెళ్లకుండా పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎవరు సెలవుల్లో వెళ్లకుండా అప్రమత్తతతో విధులు నిర్వ హించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నుంచి నీరు ప్రవ హిస్తున్న మార్గాల్లో రాకపోకలను నిషేధించాల న్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా సమర్ధవంతగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టామని, ప్రజల సౌక ర్యార్ధం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, కలెక్టరేట్‌ పాలన అధికారి రాజేశ్వర్‌, పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి రద్దు

మంచిర్యాల కలెక్టరేట్‌: భారీ వర్షాల నేపథ్యంలో సోమ వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తు న్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనిం చాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయ టకు రావాలని, ప్రజల అవసరాలకు కంట్రోల్‌ రూమ్‌ 08736-250501 ఏర్పాటు చేశామని, ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 10:36 PM

Advertising
Advertising