ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా సాధికారతతోనే అభివృద్ధి

ABN, Publish Date - Sep 12 , 2024 | 10:50 PM

మహిళా సాధికా రతతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థి కంగా అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

లక్షెట్టిపేటరూరల్‌, సెప్టెంబరు 12: మహిళా సాధికా రతతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థి కంగా అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. క్యాంటీన్‌లు, మిల్క్‌పార్లర్లు, రైసుమిల్లుల నిర్వహణ బాధ్యతలను ఐకేపీకి అప్పగించిందన్నారు. మహిళలు స్వయం సహాయక గ్రూపుల ద్వారా రుణాలు తీసుకుని వ్యాపార రంగంలో రాణించాలన్నారు. క్యాంటీన్‌లో క్వాలిటీ ఫుడ్‌ మెయింటెన్‌ చేయాలన్నారు. మహిళా సంఘాల్లో అందరూ చదవడం, రాయడం నేర్చుకోవాల న్నారు. అంతకుముందు ఉత్కూరు చౌరస్తాలో ఏర్పా టు చేసిన ఇందిర మహిళ శక్తి మిల్క్‌ పార్లర్‌ను ప్రా రంభించారు. డీఆర్‌డీవో కిషన్‌, అడిషనల్‌ డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌ రావు, స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, ఎంపీడీవో సరోజ, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో వెంకటరమణ, ఏపీఎం లక్ష్మీ, పాల్గొన్నారు.

మహిళ సంక్షేమంలో భాగంగా గ్యాస్‌ రాయితీ

మంచిర్యాల కలెక్టరేట్‌: ప్రభుత్వం మహిళ సంక్షే మంలో భాగంగా గ్యాస్‌ రాయితీ కల్పిస్తుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతిలో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలకు గ్యాస్‌పై అందిస్తున్న రాయి తీపై లబ్ధిదారులకు అర్హత, రాయితీ నగదు వివరాలు తెలియజేసే పత్రాలను అందిస్తామన్నారు. గ్యాస్‌ సిలిం డర్‌ పొందిన నాలుగు రోజుల్లో రాయితీ నగదు జమ కాకపోతే వివరాల కోసం 1967, 180042500333 నెం బర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. గ్యాస్‌ రాయితీ సంబంధిత పత్రాలను రేషన్‌ డీలర్లు, కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్షరాస్యతతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

కాసిపేట: అక్షరాస్యత ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వా సం పెరుగుతుందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నా రు. ధర్మారావుపేట, మల్కేపల్లి గ్రామాల్లో జిల్లా వయో జన విద్యాశాఖ, లయన్స్‌క్లబ్‌ సఖి సంయుక్త ఆధ్వ ర్యం లో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కేంద్రాలు, ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాలను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లా డారు. చేసే పనిని ప్రణాళికబద్దంగా చేస్తే విజయవం తంగా పూర్తి చేయవచ్చన్నారు. అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిరక్షరాస్యులను వంద రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అక్షరాస్యతతోపాటు స్వ యం ఉపాధికి కుట్టుశిక్షణ ఎంతో ఉపయోగపడుతుం దని తెలిపారు. కుట్టుశిక్షణ నేర్చుకున్న వారు మంచి ఉపాధి పొందవచ్చని తెలిపారు. మంచిర్యాలను వంద శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. చదువు తోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. డీపీవో వెంకటేశ్వర్‌రావు, లీడ్‌ బ్యాంకు డిస్టిక్‌ మేనేజర్‌ తిరుపతి, డివిజనల్‌ పంచాయతీ అధికారి సప్దర్‌ ఆలీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, సెక్టార్‌ అధికారి సత్యనారాయణమూర్తి, లయ న్స్‌క్లబ్‌ సఖి అధ్యక్షురాలు శాంకరి, డీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 10:50 PM

Advertising
Advertising