ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థుల ధర్నా

ABN, Publish Date - Sep 26 , 2024 | 10:41 PM

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌కు అందజేశారు.

నస్పూర్‌, సెప్టెంబరు 26: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌కు అందజేశారు. యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ నాలుగేళ్ళుగా ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడం లేదన్నారు. విద్యా ర్థులు ఉన్నత చదువులకు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. అభినవ్‌, కీర్తి, యశస్విని పాల్గొన్నారు.

విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాలి

గర్మిళ్ల, సెప్టెంబరు 26: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ విడుదల చేయాలని శుక్రవారం హైద్రాబాద్‌లో జరిగే విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఈదు నూరి అభినవ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Updated Date - Sep 26 , 2024 | 10:41 PM