శునకాల కళేబరాలు తొలగింపు
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:26 PM
జిల్లా కేం ద్రంలోని అండాళమ్మ కాలనీలోగల పశు సంరక్షణ కేంద్రం నుంచి మృతి చెందిన శునకాల కళేబరాలను శుక్రవారం ఉదయం సిబ్బంది తొలగించారు. ‘ఈ పాపం ఎవరిది?’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచు రితమైన కథనానికి కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పశు సంరక్షణ కేంద్రానికి చేరుకుని డాగ్ క్యాచ ర్లతో మృతి చెందిన ఎనిమిది శునకాల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి ఆస్పత్రి సమీపంలో పూడ్చి పెట్టించారు.
మంచిర్యాల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని అండాళమ్మ కాలనీలోగల పశు సంరక్షణ కేంద్రం నుంచి మృతి చెందిన శునకాల కళేబరాలను శుక్రవారం ఉదయం సిబ్బంది తొలగించారు. ‘ఈ పాపం ఎవరిది?’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచు రితమైన కథనానికి కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పశు సంరక్షణ కేంద్రానికి చేరుకుని డాగ్ క్యాచ ర్లతో మృతి చెందిన ఎనిమిది శునకాల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి ఆస్పత్రి సమీపంలో పూడ్చి పెట్టించారు. అనంతరం బతికున్న మిగతా శునకాలకు ఆహారం పెట్టాలని ఆదేశించారు. దీంతో ఉదయమే శున కాలు ఉన్న గదిని శుభ్రం చేసి, వాటికి ఆహారం అందిం చారు. కుటుంబ నియంత్రణ కోసం శస్త్ర చికిత్స చేసేం దుకు తీసుకు వచ్చిన వీధి కుక్కలు ఆలనా పాలన లేక మృత్యువాత పడ్డ సంఘటనను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వార్తా కథనం రాష్ట్రంలో సంచలనం రేపింది.
కలెక్టర్ విచారణ....
పశు సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం విచారణకు ఆదేశిం చారు. ఆస్పత్రి వెటర్నరీ వైద్యుడు కళ్యాణ్‌తోపాటు సం బంధిత అధికారులను పిలిపించారు. కాంట్రాక్టర్ తరు పున కరీంనగర్‌కు చెందిన సాయి అనే సూపర్‌వైజర్‌ను పిలిపించి విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశు సంరక్షణ కేంద్రంలో ఉన్న మిగతా శునకాలకు వెంటనే శస్త్ర చికిత్సలు చేసి విడిచి పెట్టాలని కలెక్టర్ వెటర్నరీ వైద్యున్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఎక్స్ వేదికగా హరీష్‌రావు స్పందన
’ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమై కథనానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వీధి కుక్కలకు కూడా శాపంగా మారిందని, అధికారుల అల సత్వం మూగజీవుల మౌనరోదనకు కారణమైందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపట్ల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్‌పైనా చర్యలు...?
సరైన వసతులు, సిబ్బంది లేకుండానే శునకాలకు శస్త్ర చికిత్స కోసం తీసుకొచ్చి, వాటి ప్రాణాలు పోవడానికి కారణమైన హైద్రాబాద్‌కు చెందిన ఎనిమిల్ వెల్ఫేర్ సొసైటీ ఏజెన్సీపైనా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. మూగజీవాల మరణానికి కారణమైన సదరు కాంట్రా క్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది.
సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకం
ఆస్పత్రి ప్రారంభమైనప్పటి నుంచి శునకాల ఆలనా పాలనా చూసిన సిబ్బందిని కాంట్రాక్టరు ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిలో ఒక వెటర్నరీ డాక్టర్‌తోపాటు ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్లు, ఒక వాచ్‌మన్, శునకాలకు ఆహారం వండి పెట్టేందుకు కుక్, హెల్పర్ విధులు నిర్వహిస్తున్నారు. వారందరికీ సెప్టెంబరు, అక్టోబరు రెండు నెలల వేతనాలు రావాల్సి ఉంది. వారిని ఇప్పటికే ఉద్యోగాల్లో నుంచి తొలగించినందున కనీసం తమకు రావాల్సిన వేతన బకాయిలనైనా చెల్లించాలని సిబ్బంది వేడుకుంటున్నారు. అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి, తమ సమస్య పరిష్కారం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Nov 08 , 2024 | 10:26 PM