మహాలక్ష్మి లబ్ధిదారులకు సబ్సిడీ పత్రాలు పంపిణీ
ABN, Publish Date - Sep 27 , 2024 | 10:43 PM
మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
మందమర్రిటౌన్, సెప్టెంబరు 27: మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా సీఎం రేవంత్‌రెడ్డి పథకాలకు నిధులు కేటయిస్తూ సమర్ధవంతంగా అమ లు చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సతీష్‌కుమార్, నాయకులు సుదర్శన్, ఉపేందర్‌గౌడ్, ప్రభాకర్‌రావు, కడారి జీవన్, రమేష్, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు.
రామకృష్ణాపూర్: మున్సిపల్ కార్యాలయంలో మహా లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సబ్సిడీ పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పేద లకు ఎన్నో రకాల సంక్షేమ పథకాల అమలు చేస్తున్నా డని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఏ రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. చైర్‌పర్సన్ జంగం కళ, వైస్‌చైర్మన్ విద్యాసాగర్, కమిషనర్ మురళికృష్ణ, కౌన్సిల్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 10:43 PM